బ్రేకింగ్ : తెలుగు అకాడమీ స్కాంలో ఇద్దరు అరెస్ట్

-

తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ లో తాజాగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ సంతోష్‌ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ, అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గల్లంతైన నిధుల మొత్తం పెరుగుతోంది.

తెలుగు అకాడమీ నిధులు 70 కోట్లు ఇప్పటి వరకు గల్లంతైనట్లు గుర్తించారు పోలీసులు యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుండి 43 కోట్లు.. సంతోష్ నగర్ శాఖ నుండి ఎనిమిది కోట్లు, మరియు చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ నుండి 9 కోట్లు గల్లంతు అయ్యాయి. ప్రధాన సూత్రధారి తోపాటు మరో అనుమానితుడి విచారిస్తున్న సిసిఎస్ పోలీసులు.. చందానగర్ కెనరా బ్యాంక్ నుండి 9 కోట్లు ఇతరుల సహాయంతో కాజేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించారు. త్రిసభ్య కమిటీ విచారణలో వరుసగా అధికారులు చేసిన అవినీతి బయట పడుతోంది.ఇంకా ఎంతో అధికారులు ఈ స్కాం లో ఉన్నరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version