కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలు, రామారెడ్డి మండలం నుంచి ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలంలోని తొమ్మిది గ్రామాలను కలిపి ఎర్రవల్లి మండలంగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.