బ్రేకింగ్ : ఏపీలో ఒకే రోజు రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదు

-

ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను కుదేపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కొత్త వేరియంట్‌.. 66 దేశాల‌కు పైగా…. పాకింది. ఇక మ‌న‌దేశంలోనూ.. ఈ వైర‌స్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. అయితే.. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. విజ‌య వాడ నగ‌రంలో ఒక‌టి న‌మోదు కాగా.. శ్రీ‌వారి స‌న్నిధి అయిన‌… తిరుప‌తి లో మ‌రోక కేసు న‌మోదు అయింది. ఈ విష‌యాన్ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవిక‌రించింది.

ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. విజయనగరం జిల్లాలో రెండు దఫా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంప‌గా… జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకుండానే ఒమిక్రాన్ సోకింద‌ని స్పష్టం చేసింది ఆంధ్ర ప్ర‌దేశ్  రాష్ట్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version