రాజస్థాన్ లో ఒక మహిళ కి 40 సెకండ్లలో రెండు కరోనా టీకాలు డోసులు ఇచ్చేశారు. జూలై 3న ఈ సంఘటన జరిగింది. బకరాలో కరోనా వాక్సినేషన్ క్యాంప్ జరగగా దానిలో ఒక మహిళ కి 40 సెకండ్లలో 2 కరోనా వ్యాక్సిన్స్ ని ఇచ్చారు.
ఆ సమయంలో ఆరోగ్య సిబ్బంది ఫోన్లో మాట్లాడుతున్నారని అలా ఫోన్లో మాట్లాడుతూ రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చేశారు అని కంప్లైంట్ చేసింది. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆమెకి రాలేదు. ఒకవేళ తన భార్యకి ఏమైనా జరిగితే ఆరోగ్య శాఖ బాధ్యత వహించాలని ఆమె భర్త అన్నాడు.
బకరాలో జులై 3న జరిగిన వాక్సినేషన్ క్యాంప్ కి సురేంద్ర కుమార్ తన భార్య మాయ దేవిని తీసుకుని వచ్చాడు. వ్యాక్సినేషన్ కోసం మాయ లోపలికి వెళ్ళింది. అయితే లోపల చాంబర్లో ఉన్న ఇద్దరు ఆరోగ్య నిపుణులు కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
మొదటి డోసు తీసుకున్నాక వెంటనే రెండవ డోస్ ని కూడా ఇచ్చేశారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారని ఆమె చెప్పింది. అయితే అరగంట పాటు అక్కడే రెస్ట్ తీసుకోమని వాళ్ళు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు అని కూడా ఆమె అంది.
అయితే ఇలా జరగడం ఏమాత్రము మంచిది కాదని తమ తన భార్యకు ఏమైనా అయితే బాధ్యత వహించాలని భర్త అన్నాడు. మెడికల్ స్టాఫ్ సరిగ్గా లేనందున ఈ తప్పు జరిగింది. అయితే కేరళలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. 63 ఏళ్ల ఆయనకి ఒక వ్యాక్సిన్ తర్వాత మరొక వ్యాక్సిన్ వేసారు.