వ్యాక్సిన్ తీసుకున్నాక చేసే ఈ పొరపాట్లు.. కరోనా సోకడానికి సంకేతాలు.

-

సెకండ్ వేవ్ భయంకరంగా విస్తరించింది. ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. వైరస్ ధాటికి తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఐతే ప్రస్తుతం కరోనా corona వ్యాక్సినేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. దేశమంతటా వ్యాక్సినేషన్ చాలా జోరుగా సాగుతుంది. అదీగాక ప్రస్తుతం కరోనా కేసులు కూడా తగ్గాయి. కాకపోతే చాలామంది వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ వైరస్ సోకిన సందర్భాలు చాలా కనిపించాయి.

కరోనా/ corona
కరోనా/ corona

ఇలా అవడానికి కారణాలేంటి? వ్యాక్సిన్ వేసుకున్నాక చేసే ఏ పొరపాట్లు కరోనా సోకడానికి కారణాలవుతున్నాయనేది ఇక్కడ చూద్దాం.

మాస్క్ పెట్టుకోకపోవడం

చాలామంది చేస్తున్న తప్పు ఇదే. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఏం ఫర్వాలేదని అనుకుంటూ మాస్క్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే కరోనా సోకడానికి కారణంగా నిలుస్తుంది. అదే కాదు భౌతిక దూరం పాటించడంలో అలక్ష్యం కూడా దీనికి కారణంగా ఉంటుంది. శానిటైజర్ వాడకపోవడం మొదలగునవన్నీ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

బలహీనత

కొందరికి కొన్ని రకాల వ్యాధుల వల్ల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇతరత్రా వ్యాధుల కారణంగా యాంటీబాడీలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువ.

సమూహాలు

కేసులు తగ్గాయి, వ్యాక్సిన్ వేసుకున్నామని చెప్పి సమూహాలలో పాల్గొనడం, కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త సమూహాలకి వెళ్ళడం వంటివన్నీ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కరోనా సోకే అవకాశంగా ఉంటుంది. కరోనా రూపాంతరాలు వ్యాక్సిన్ ని ఎదుర్కొంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమూహాలకి వెళ్ళడం సరైన పని కాదు.

వయస్సు, లింగము

చాలా సార్లు వయసు కారణం అవుతుంది. ముఖ్యంగా 55ఏళ్ళు పైబడ్డ మహిళల్లో ఇది ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news