రుతుగానం వింటూ
వసంత కాలమే హాయి
అని పాడుకుంటూ
పచ్చని పందిళ్ల చెంత
పరికిణీ ఓణీలలో సందడి చేసే
ఆడబిడ్డలే మన పండుగ సంతోషాలు
అని చాటి చెబుతూ…
ఇవాళ మన భాష మన తెలుగు
మన సంస్కృతి వర్థిల్లాలి అని కోరుకుందాం
మన లోకం న్యూస్ మీడియా పాఠకులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. వసంత కాల ఆగమన వేళ ఆనందాలు వెల్లి విరుస్తాయి. జీవితాలకు సరిపడినంత ఆనందాలు వెల్లి విరిసి కొత్త ఏడాది ఆరంభాలు పలకరిస్తాయి. ముఖ్యంగా రుతు రాగం మనస్సును ఆహ్లాదపరుస్తుంది. కోయిల గానం హృదయాలను తేలికపరుస్తుంది. ఏడాదంతా ఓ కొత్త మార్పు కోసం చేసే నిరీక్షణకు సంకేతమే ఉగాది. చేదు లేని చోటు తీపికి విలువెక్కడని? అందుకే తీపి చేదుల మధురానుభూతిని ఆస్వాదించేందుకు ఉగాది సన్నద్ధం కావాలని సందేశిస్తోంది.
ఇంకా ఉగాది ఏం చెబుతుంది
ఆనందాలను పంచుకుంటూ ఇతరులకు మేలు చేయమని ఉపదేశిస్తుంది. రాజపూజ్యం, అవమానం అన్నవి ఎలా ఉన్నా కొన్ని అవలక్షణాలను వదులుకోవాలని చెబుతుంది. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణం కోసం చేసే మేలు ఇవన్నీ కూడా రాజపూజ్యంలో భాగమే అనుకోవాలి. ప్రకృతికి విఘాతం కలిగించే విధంగా చేసే ఏ పని అయినా అది అవమానమే! మనకు మనం చేసుకునే అవమానమే!
………మనసుకు చేరువ సంస్కృతి
హృదయోల్లాస గీతిక సంప్రదాయ రీతి
తెలుగు భాషకు సంస్కృతికి ఎల్లకాలం తోడుండే ఉగాది అంటే ఎందరికో ఇష్టం. ఎందరికో ప్రాణం కూడా! పంచాంగ శ్రవణం ఎన్నో విషయాలు మోసుకుని వస్తుంది. రాజ్యం ఎలా ఉండనుంది. వర్షాలు ఎలా ఉండనున్నాయి. రుతువుల గమనం ఎలా ఉంటుంది. ఇవన్నీ చెబుతూనే భవిష్య కాల సందేశాలను వివరిస్తుంది. జీవితం ఒక్కో చోట ఒక్కో విధంగా ప్రతి మలుపులో ఉండే ఆనందమే కాదు ప్రతి మలుపూ ఇచ్చే సవాళ్లనూ స్వీకరిస్తూ ఉంటే అప్పుడు జీవితార్థం తెలిసి వస్తుంది. కాల క్రమణిక మరియు గమనం ఇంకాస్త వివరంగా మనసుకు చేరువ అవుతాయి.
ఇంకా పండుగ తెచ్చేవేంటి?