దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి పూర్తి అనుమతి ఇచ్చింది. ప్రత్యక్షంగా కానీ, ఆన్ లైన్ లో కానీ.. రెండు రకాలుగా కానీ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలు, యూనివర్సిటీలు తెరచుకోవచ్చని స్పష్టం చేశింది.
అలాగే వీలు అయితే ప్రత్యక్ష తరగతులను కూడా నిర్వహించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అలాగే అన్ని రకాల పరీక్షలను కూడా నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు నిర్వహించే సమయంఓ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. కాగ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తోపాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలో సాదారణ పరిస్థితులు వస్తున్నాయి.