ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు అంతర్జాతీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రష్యా కు చెందిన పలు ఉత్పత్తులను పలు ప్రపంచ దేశాలు బ్యాన్ చేశాయి. అలాగే రష్యా పై ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. రష్యాపై ఈ రెండు దేశాలు కఠినమైన ఆంక్షలను విధిస్తున్నాయి. తాజా గా అమెరికా, బ్రిటన్ మరో బిగ్ షాక్ ను రష్యాకు ఇచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతులపై బ్యాన్ విధించాయి.
చమురు తో పాటు గ్యాస్ దిగుమతి పై కూడా అమెరికా బ్యాన్ విధించింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్.. రష్యా పై కఠిన ఆంక్షలను విధించాయి. అంతే కాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆస్తులను కూడా ఈ రెండు దేశాలు ఫ్రీజ్ చేశాయి. ప్రస్తుతం చమురు ఉత్పత్తులపై బ్యాన్ విధించాయి. కాగ ఈ బ్యాన్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బంది పడుతారని అయినా.. ఈ నిర్ణయం మీద వెనక్కి తగ్గమని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు.
కాగ చమురు ఉత్పత్తులపై బ్యాన్ విధించడం వల్ల రష్యా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉందని జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేంత వరకు తమ ఆంక్షలను కొనసాగిస్తామని తెలిపారు.