BREAKING NEWS: యుద్దానికి రష్యా బ్రేక్… తాత్కాలికంగా కాల్పుల విరమణ

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఈరోజుతో పదో రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. యుద్ధానికి రష్యా బ్రేక్ ఇచ్చింది. తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తూ రష్యా నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ పై కాల్పుల విరమణ ప్రకటించింది. ప్రపంచ దేశాల ఒత్తడితో నిర్ణయం తీసుకుంది. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 11.30 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విదేశీయును తరలించేందుకు కాల్పులు విరమణ ప్రకటించాలని రష్యాను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత దేశం కూడా రష్యాను పలు మార్లు కోరింది. రష్యా తూర్పు ప్రాంతంలో భారతీయ విద్యార్థులు చిక్కుపోయారు. 

కీవ్, ఖర్కీవ్, సుమీ నగరాల్లో ఇప్పటికీ 2000 నుంచి 3000 మంది భారతీయులు చిక్కుకుపోయారు. అయితే వీరందరిని రష్యా ఇచ్చిన గడువు లోగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే.. కల్లోలిత తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల పోలాండ్, రోమేనియా, హంగేరి సరిహద్దులకు వెళ్లాలంటే.. దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం రష్యా ఇచ్చిన టైమ్ లో తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం దొరికింది. ఇప్పటికే రష్యా పలు బస్సులను ఏర్పాటు చేసింది. కాల్పుల విరమణ ప్రకటించాలని గత కొన్ని రోజులుగా భారత్ రిక్వెస్ట్ చేసింది. దీనికి రష్యా కూడా భారత్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు యూఎన్ఓ మానవహక్కుల సంఘం అభ్యర్థను పరిగణలోకి తీసుకుని రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news