రష్యా, ఉక్రెయిన్ పై దాడులను తీవ్రతరం చేసింది. 24 రోజుల నుంచి సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నాశనం అవుతోంది. సుందరంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు మసిదిబ్బలుగా మారుతున్నాయి. రాజధాని కీవ్ తో సహా.. ఖార్కీవ్, మరియోపోల్, ఎల్వీవ్ నగరాలపై రష్యన్ ఆర్మీ తీవ్రంగా దాడి చేస్తోంది. ఈ నగరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే సాధారణ జనవాసాలను కూడా రష్యా టార్గెట్ చేస్తోంది. దీంతో ప్రజలు చనిపోతున్నారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడుల వల్ల మానవసంక్షోభం తలెత్తుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి చాలా మంది ప్రజలు సరిహద్దు దేశాలైన పోలాండ్, రొమేనియా, హంగేరీ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 32 లక్షల మంది ప్రజలు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి అంచానా వేసింది. మరో వైపు యుద్ధం వల్ల దేశంలోని 65 లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు వెల్లడించింది. యుద్దం కారణంగా యూరప్ ఈ శతాబ్ధంలోనే ఎప్పుడూ చూడని వలస సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.