ఉక్రెయిన్ కు యూకే భారీ సాయం… అధునాతన క్షిపణులతో పాటు ఆర్థిక సాయం

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సేనలు రష్యన్ బలగాలకు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. యుద్దం ప్రారంభం అయి నెల కావస్తున్నా… ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ముఖ్యంగా ఉక్రెయన్ రాజధాని కీవ్ ను దక్కించుకునేందుకు గత కొన్ని రోజులుగా పోరాడుతున్నా… ఉక్రెయిన్ బలగాల నుంచి అనూహ్యమైన ప్రతిఘటన ఎదురవుతుండటంతో రష్యాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కేవలం రెండు మూడు రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నప్పటికీ… నెల రోజులుగా బలమైన రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది.

ముఖ్యంగా అమెరికా, యూకే, మిగతా నాటో దేశాల సైనిక, సాంకేతిక సహాయంలో రష్యాను ఎదురుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే అమెరికా, ఉక్రెయిన్ కు భారీగానే ఆర్థిక, సైనిక సాయం చేసింది. తాజాగా యునైటెడ్ కింగ్ డమ్( యూకే ) కూడా ఉక్రెయిన్ కు భారీగా సైనిక, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఇప్పటికే ఉక్రెయిన్ కు 4000 4,000 NLAW & జావెలిన్ క్షిపణులను అందించింది. వీటిికి అదనంగా మరో 6000 క్షిపణులను అందించేందుకు సిద్ధమైంది. స్టార్ స్ట్రీక్ హై- వెలాసిటీ యాంటి ఎయిర్ క్షిపణునులతో పాటు రక్షణాత్మక సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇది ఉక్రెయిన్లు తమను తాము రక్షించుకునేందుకు సహాయపడుతుందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇప్పటికే యూకే, ఉక్రెయిన్ మిలిటరీకి 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. మరో 400 మిలియన్ పౌండ్లను మానవతా సాయం కింద అందించనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news