ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భావం లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు నటుడు నందమూరి తారకరామారావు పేరుమీద రూ. 100 స్మారక నాణాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా కొందరు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇప్పుడు మాజీ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక కీలకమైన కామెంట్ చేశారు. లక్ష్మి పార్వతిని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి ఉంటే బాగుండేది అంటూ అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని బయట పెట్టారు. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టిందంటూ మీడియా తో పంచుకున్నాడు ఉండవల్లి. “ఎన్టీఆర్ తన ఆఖరి రోజుల్లో చెప్పిన విధంగా లక్ష్మి పార్వతి వలన మాత్రమే నేను బ్రతికాను అని చెప్పారు మరియు తిరుపతిలోని ఒక వేదికపై ఆమెను బహిరంగంగా పెళ్లి చేసుకున్నారు..
లక్ష్మీపార్వతిని పిలిచుంటే బాగుండేది : ఉండవల్లి అరుణ్ కుమార్
-