వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల,ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, కవిత ఇంద్రారెడ్డి, ఎంపీ రాములు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్. అనంతరం పెద్ద గూడెం వద్ద బహిరంగ సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూం.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు.
బీసీల విద్య కోసం అనేక గురుకులాలు, కళాశాలలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు మంత్రి గంగుల. 1,60,600 మంది బీసీ బిడ్డలు గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్నారు అని తెలిపారు. అంతేకాక నూతనంగా 16 బీసీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. కరీంనగర్, వనపర్తి లో బీసీ అగ్రికల్చర్ డిగ్రీ మహిళా కాలేజీ ను ఏర్పాటు చేసుకున్నామని.. బీసీ బిడ్డలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.