వచ్చే వందేళ్ల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2022-23 కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం ఉపయోగపడుతోందని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో వెళ్తుందని.. నవ శకానికి నాంది పలికేలా బడ్జెట్ ఉందని అన్నారు. వందే భారత్ ట్రైన్స్, కిసాన్ డ్రోన్స్, డిజిటల్ కరెన్సీ, బ్యాంకింగ్ యూనిట్లు మొదలైనవి యువతకు, దళితులకు, వెనకబడిన వారి అభివ్రుద్దికి ఉపయోగపడుతాయని మోదీ అన్నారు. ఉద్యోగాలు, మౌళిక వసతులు, అభివ్రుద్ది ప్రాతిపదికన బడ్జెట్ రూపొందించామని ఆయన అన్నారు. వ్యవసాయ స్టార్టప్ కోసం నిధులు కేటాయించామని అన్నారు. వ్యవసాయదారుల ఆదాయం పెరిగేలా బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. బడ్జెట్లో రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. 68 శాతం రక్షణ ఉత్పత్తులు దేశీయంగానే సమకూర్చుకోవాలని నిర్ణయించామని.. దీని వల్ల ఇండియాలో ఎమ్ఎస్ఎంఈ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. గంగా పరివాహక ప్రాంతాల్లో న్యాచురల్ ఫార్మింగ్ కు ప్రోత్సహకాలు ఇస్తున్నామని… దీని వల్ల గంగా నదిని కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు.
వచ్చే వందేళ్ల కోసం ఈ బడ్జెట్… దేశ యువత ఉజ్వల భవిష్యత్ కు ఉపయోగం- ప్రధాని నరేంద్ర మోదీ
-