Breaking : ప్రభుత్వ రంగ గ్యాస్ రిటైల్ సంస్థలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..

-

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్​పీజీ గ్యాస్​ను తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా నష్టపోయిన మూడు సంస్థలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వన్-టైమ్ గ్రాంటు కింద రూ.22 వేల కోట్ల సాయం చేయనున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ఈ గ్రాంటు అందుకోనున్నాయి. ‘2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్య ఈ సంస్థలు అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లను విక్రయించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వినియోగదారులకు సరఫరా చేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయంగా ఎల్​పీజీ ధరలు 300 శాతం పెరిగాయి.

LPG सिलेंडर की करें पहचान, कभी नहीं होगा नुकसान, जानिए आपके फायदे की 5  बातें | Zee Business Hindi

కానీ, దేశీయంగా మాత్రం ఈ సమయంలో 72 శాతం మాత్రమే ఎల్​పీజీ ధరలు పెరిగాయి. వినియోగదారులపై భారం పడకుండా.. అధిక ధరలను వారికి బదిలీ చేయలేదు. నష్టాలు వచ్చినా.. మూడు సంస్థలు వినియోగదారులకు వంట గ్యాస్​ను నిరంతరం సరఫరా చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రూ.22వేల కోట్ల గ్రాంటు అందించాలని నిర్ణయించాం’ అని ప్రభుత్వ ప్రకటన వివరించింది.మరోవైపు, రైల్వే ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్‌ను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.11.27లక్షల రైల్వే ఉద్యోగులకు రూ.1,832 కోట్ల బోనస్‌ ఇవ్వడానికి నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి 78 రోజుల బోనస్‌ గరిష్ఠంగా రూ.17,951 అందనుంది. మరోవైపు ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కొత్త పథకానికి, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్‌ సొసైటీల సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news