సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు

మరోసారి సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి నేడు ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జాతీయపతాక ఆవిష్కరణ కోసం కిషన్ రెడ్డి విచ్చేశారు. తన పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్యకు భారతరత్నపై కేంద్రం నిర్ణయిస్తుందని వెల్లడించారు కిషన్ రెడ్డి. ఇదే అంశంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదన వచ్చిన విషయం తనకు తెలియదని అన్నారు కిషన్ రెడ్డి.

TRS cannot stop BJP, says Kishan Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మా సీఎం నెలలో ఒక్కరోజు కూడా సచివాలయానికి రారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 10 రోజులు ఇంట్లో, 20 రోజులు ఫాంహౌస్ లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఐదురోజుల పాటు అక్కడ ఏంచేశారని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము కూడా సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు కిషన్ రెడ్డి.