వ్యవసాయంతో కోట్లకు పడగెత్తిన గ్రామం.. రైతులంటే వీళ్లేరా..!

-

పల్లెటూర్లంటే.. ప్రకృతి అందాలకు పట్టుకొమ్మలు. పచ్చిన చెట్లు, ఇంట్లో కోళ్లు, మేకలు, గేదలు, కాలవలు, పచ్చిన పొలాలు..చెమటోడ్చి కష్టపడే రైతులు. పగలంతా పొలంతో కష్టపడి.. రాత్రికి వెన్నల్లో నిద్రపోతారు. పల్లెటూర్లు అంటే ఇంచుమించు ఇలానే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం.. పేరుకే పల్లెటూరు.. మెట్రో సిటీలను సైతం తలదన్నేరీతిలో ఉంటుంది. హైటెక్ హంగులతో ఉండే విలాసవంతమైన ఇళ్లు.. పెద్ద పెద్ద రోడ్లు.. ఖరీదైన కార్లు. స్మార్ట్ సిటీలు కూడా ఈ గ్రామం కింద పనికిరావు. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. ప్రతి వ్యక్తి వార్షికాదాయం రూ.80 లక్షలపైనే ఉంటుందట..చైనాలో ఉన్న ఈ పాష్‌ పల్లెటూరి గురించి చూద్దామా..!
చైనాలోని జియాగ్యిన్ నగరానికి సమీపంలో హువాజీ అనే గ్రామం ఉంటుంది. ప్రపంచంలోనే ఇది ధనిక గ్రామం. ఇక్కడ నివసించే ప్రతి ఫ్యామిలీ.. నగరాల్లో నివసించే ధనవంతులతో సమానంగా సంపాదిస్తారట. హువాజీ గ్రామంలో ఉండే ప్రతి ఇల్లు ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఖరీదై కార్లు ఉంటాయి. గ్రామం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. పక్కా రోడ్లు ఉంటాయి. అసలు ఇదంతా ప్రత్యేక లోకంలా.. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ గ్రామంలో ఉండే ప్రజలను చూసి… స్మార్ట్ సిటీలో ఉండే వారు కూడా అసూయ పడతారట. వీరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా..? వ్యవసాయం. వ్యవసాయంతో ఇంత లాభమా.. అనిపిస్తుంది కదా.. ఇక్కడున్న వారంతా వ్యవసాయం చేస్తారు. పంటల ద్వారానే భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. మనదేశంలో వ్యవసాయం అంటే.. అప్పులకు కేరాఫ్‌ అడ్రస్‌.. కానీ హువాజీ గ్రామస్తులు (Huaxi Farmers) మాత్రం వ్యవసాయంతోనే కోటీశ్వరులయ్యారు.
ఒకప్పడు మాత్రం ఈ గ్రామం ఎన్నో ఇబ్బందులు పడింది. 1961లో ఈ గ్రామం ఏర్పడింది. అప్పుడు ఇక్కడి ప్రజలు చాలా పేదవారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండేది.. కానీ వ్యవసాయం పరిస్థితి అప్పట్లో చాలా అధ్వాన్నంగా ఉండేది. ఆ తర్వాత గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రెసిడెంట్‌ వు రెన్వావో గ్రామ ముఖచిత్రాన్నే మార్చాశారు. వ్యవసాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఎవరి పంట వారు పండించకుండా.. అందరూ కలిసి ఉమ్మడి వ్యవసాయం చేశారు. ప్రతి రైతు తన భూమిలో సాగు చేయకుండా.. సమూహాలుగా ఏర్పడి సాగు చేయడం ప్రారంభించారు. తెలుగు ఈ కాన్సప్ట్‌తో సినిమా తీశారు.. గుర్తొచ్చిందా..! అలా.. సామూహిక వ్యవసాయం వల్ల పంట ఉత్పత్తి పెరిగింది. బాగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అందరు కలిసి మెలిసి జీవిస్తూ… కోటీశ్వరలయ్యారు. ఇలాంటి కాన్సప్ట్‌ మన దగ్గర కూడా చేస్తే బాగుంటుంది కదూ.. కానీ మనోళ్లకు అనుమానం ఎక్కువ..! ఇలాంటివి ససేమిరా ఒప్పుకోరూ.!

Read more RELATED
Recommended to you

Latest news