రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాబ్ బుక్ చేస్తామని ట్రాప్ చేసి బాలికపై అత్యాచారం చేశారు నిందితులు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని ట్రాప్ చేశారు నిందితులు. నిందితులే బలవంతం చేశారని బాధిత బాలిక రెండో సారి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే పబ్ లో నుంచి స్నేహితురాలితో బయటకు వచ్చిన బాధిత బాలికను నిందితులు ఫాలో చేశారు. ఇదే సమయంలో స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. ఆ సమయంలో బాధితురాలి స్నేహితుడు పబ్ లోనే ఉన్నాడు. బాలిక కనిపించకపోవడంతో అతను ఫోన్ చేసినా.. నిందితులు ఫోన్ లాక్కోవడంతో లిఫ్ట్ చేయలేకపోయింది.
ఫోన్ లో సిగ్నల్ సరిగ్గా లేదని మేమే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ బాధితురాలిని బెంజ్ కారులో ఎక్కించుకున్నారు నిందితులు. పబ్ నుంచి బంజారా హిల్స్ కాన్స్ బేకరి వద్దకు వెళ్లింది. బెంజ్ కార్ లో ఉన్నప్పుడే బాధితురాలి హ్యాండ్ బ్యాగ్, కళ్ల జోడును నిందితులు లాక్కున్నారు. ఆ సమయంలో బాలికపై అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. బేకరి వద్దకు రాగానే కార్ ఇరుకుగా ఉందంటూ.. ఇన్నోవాలోకి బాలికను షిఫ్ట్ చేశారు నిందితులు. అయితే తనకు తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు ఇస్తారని ఇన్నోవాలోకి వెళ్లానని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇన్నోవా కారులోనే ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు.