సాధారణంగా కౌన్సిలర్ గా కానీ, సర్పంచ్ గా కానీ గెలిచిన వెంటనే.. పెద్ద కారు కొనడం లాంటివి చేస్తు ఉంటారు. కానీ ఐదు సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు ఒక్క వాహానం కూడా కొనుగోలు చేయలేదు. అతను ఎవరో కాదు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మొదటి సారి అసెంబ్లి ఎన్నికల బరిలో నిలిచున్నారు.
ఈ రోజు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలలో యోగి ఆదిత్య నాథ్ ఆస్తి వివరాలను జోడించారు. తనకు రూ. 1.50 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే రూ. 12 వేల విలువైన ఫోన్ తో పాటు రూ. లక్ష విలువైన రివాల్వర్, రూ. 80 వేల విలువైన రైఫిల్ ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు.
అలాగే తనకు సొంత వాహనం కూడా లేదని ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. అలాగే తన పై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. అయితే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సొంత వాహనం లేక పోవడంతో పలువురు యోగి ఆదిత్య నాథ్ నిజాయితీని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.