ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ, ఆమె మైనర్ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు తండ్రి, కొడుకుతో పాటు అతని స్నేహితులు. ఈ ఘటన యూపీలోని కనౌజ్ జిల్లా జరిగింది. సదర్ కొత్వాలీకి చెందిన ఓ బాధిత మహిళ మూడేళ్ల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు మహిళకు వివాహం చేయాలని బంధువులు భావించారు. మావైయా గ్రామానికి చెందిన అమిత్ అలియాస్ నహర్ సింగ్ మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటాడనే నమ్మడంతో సదరు మహిళ, తన ఇద్దరు కూతుళ్లతో నిందితుడి ఇంటికి వెళ్లేది.
నిందితుడు అమిత్ తో బాధిత మహిళ శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈక్రమంలోనే నిందితుడు నోయిడాలోని తన ఇంటికి తీసుకెళ్లి..తండ్రి రామ్ సింగ్, స్నేహితులు దిలీప్, పవ్నేష్ బాధిత మహిళతో పాటు ఆమె కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు మహిళ, ఆమె కూతురు వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించారని… తన 15 ఏళ్ల కూతురును చిత్ర హింసల పాలుచేశారని..వ్యభిచారం చేయాలంటూ ఒత్తడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పొలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.