BholaShankar : ప్రతి తెలుగు ఇంటి ఆరాధ్యుడు..మన భోళా శంకరుడు

-

ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 150 4వ సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించాడు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌..చిరంజీవి చెల్లెలు రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

నేడు రక్షా బంధన్‌ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. కిర్తీ సురేష్‌.. చిరంజీవికి రాఖీ కడుతున్న వీడియో తాజాగా విడుదల చేసింది. అంతేకాదు.. ప్రతి తెలుగు ఇంటి ఆరాధ్యుడు! వెన్నంటి ఉండే అందరివాడు! మన భోళా శంకరుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news