బీజేపీ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి : ఉత్తమ్‌

-

దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని టార్గెట్​ చేస్తూ కేసుల పేరుతో ఇబ్బంది పెట్టుడేందని ఎంపీ ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి మండిపడ్డారు. ఇది బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి. దీనికి నిరసనగా ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్​ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా సోనియా గాంధీ ఈ నెల 21న విచారణకు హాజరవుతారని చెప్పారు ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి. బీజేపీ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి. ఈ కేసులో మనీ లాండరింగ్​ అబద్ధమని, ఈడీ నిరాధారమైన ఆరోపణలు చేసిందన్నారు.

Uttam Kumar Reddy resigns as chief of Telangana Congress- The New Indian  Express

దేశంలో ఎన్నో సమస్యలున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోడీ సర్కార్​ ఈ పని చేస్తోందన్నారు ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి. అయితే ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 5 రోజులు విచారించింది. రాహుల్‌తో పాటు సోనియాగాంధీకి కూడా ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. సోనియా గాంధీకి కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆసుపత్రి నుంచి ఇంటి చేరుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈడీ సోనియా గాంధీ జులై 21న విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news