కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారం పై స్పందించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక వేల, మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఇలాంటి కాంట్రవర్సీ విషయాలపై తాను ఇప్పుడే స్పందించబోనని స్పష్టం చేశారు.
తనది నల్గొండ జిల్లా అయినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులేంటో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నారని తెలిపారు. ఎవరెన్ని డబ్బులు పంచినా, మద్యం పంచినా మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలవబోతున్నారనే ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర రేపు ఉదయం తెలంగాణలోకి ప్రవేశిస్తుందని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు ఉదయం 7 గంటల నుంచి తొలి రోజు పది కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి మూడు రోజులపాటు యాత్రకు దీపావళి బ్రేక్ ఉంటుందని.. తిరిగి 27వ తేదీన ఉదయం యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.