Breaking : మంకీపాక్స్‌కు మందు దొరికేసినట్లే..

-

ఓ వైపు కరోనా రక్కసితో పోరాడుతున్న ప్రజలపై మరోవైపు మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ దాడి చేస్తోంది. అయితే.. కరోనా స్థాయిలో ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ దొరికినట్లు తెలుస్తోంది. అవును.. మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు మశూచీ టీకాను వాడేందుకు అనుమతించింది జపాన్ వైద్య ఆరోగ్య శాఖ. మంకీపాక్స్ లక్షణాలున్న వారిలో 85 శాతం ప్రభావ వంతంగా స్మాల్ ఫాక్స్ టీకా పనిచేస్తోందని ప్రకటించింది జపాన్ వైద్య ఆరోగ్య శాఖ. గత జులైలో ఈవ్యాధి లక్షణాలున్న ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించిన తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా మంకీపాక్స్ నివారణకు మచూశీ టీకా పనిచేస్తోందని కన్ఫర్మ్ చేసింది జపాన్ వైద్య ఆరోగ్య శాఖ. స్మాల్ ఫాక్స్ టీకా తీసుకున్న 30 ఏళ్ల వయస్సున్న ఇద్దరు విదేశాలకు వెళ్లారు.

ఈవైరస్ వ్యాప్తి చెందకుండా జపాన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను సూచించింది. మంకీపాక్స్ చికిత్స కోసం జపాన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెకోవిరిమాట్ అనే ఔషధాన్ని పరిశీలిస్తోంది. ఇది మశూచికి చికిత్స చేయడానికి ఉపయోగించే నోటి మందని ఓ వార్తా సంస్థ తెలిపింది. సన్నిహిత శారీరక సంబంధం ద్వారా వ్యాపించే ఉష్ణమండల వ్యాధి యొక్క లక్షణాలు మశూచి మాదిరిగానే ఉంటాయని…జ్వరం, దద్దుర్లు, చర్మ గాయాలు వంటి లక్షణాలుంటాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జపాన్ లో మంకీపాక్స్ కేసులను నివారించడంపైనే ప్రధానంగా దృష్టిసారించామని… తమకు స్మాల్ పాక్స్ టీకాలు వేయాలని ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారని..ఈఅంశం పరిశీలనలో ఉందని జపాన్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version