అజిత్ ‘వలిమై’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే…

-

కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీగానే అంచానాలు ఉన్నాయి. పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈసినిమా ఫిబ్రవరి 24న విడుదల సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ బోణీ కపూర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటిస్తోంది. ముందుగా తమిళంలోనే విడుదల చేయాలనుకున్న వలిమై సినిమాని తరువాత ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కరోనా పరిస్థితులు నార్మల్ అవుతుండటంతో.. తెలుగులో పాటు తమిళంలో వరసగా సినిమాలు విడుదల అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version