వామ్మో అరియానా సంపాదన అన్ని రూ.లక్షలా..?

-

అరియాన గ్లోరీ.. సోషల్ మీడియాలో ఈమె పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ సీజన్ ఫోర్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. తన పర్ఫామెన్స్, స్ట్రాటజీ తో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పవచ్చు. అలా బిగ్ బాస్ తో పాపులారిటీని సంపాదించుకోక ముందే రాంగోపాల్ వర్మతో చేసిన కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మరింత పాపులారిటీ అయింది అరియానా.. ఇక అప్పటినుంచి ఈమె బాగా తన కెరియర్ లో దూసుకు వెళ్తోందని చెప్పవచ్చు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం దక్కించుకొని.. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 6 కోసం బీబీ కేఫ్ కి హోస్టుగా చేస్తోంది. బిగ్ బాస్ కేఫ్ కోసం అరియానా భారీ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రతిరోజు జరిగే బిగ్ బాస్ ఎపిసోడ్ మీద రివ్యూ లాగా ఆ హౌస్ మేట్స్ కి సంబంధించిన వారితో కానీ లేదా బిగ్ బాస్ రివ్యూ చెప్పే యూట్యూబర్స్ తో కానీ రోజుకొకరితో అరియానా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కేఫ్ కోసం అరియానా రోజుకు రూ.50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు పారితోషకం తీసుకుంటోంది అని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే అరియానా కొన్ని లక్షల రూపాయలను వెనకేసుకున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే హౌస్ లో ఉన్న వారి కంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా అరియానా భారీ మొత్తంలో సంపాదిస్తోందని అర్థమవుతుంది.

కేవలం బిగ్ బాస్ ద్వారానే కాదు అటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ మరింత ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మరింత సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాను. ప్రస్తుతం హౌస్ లో ఆట ఆడేది హౌస్ మేట్స్ అయితే వారి గురించి పాజిటివ్ , నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఈమె కూడా మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ షో వల్ల ఈమె బాగా లాభ పడిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version