చెట్టు ఒకటే.. కానీ కాసే పండ్లు మాత్రం 40 రకాలట.. తినటానికే కాదు చూడ్డానికి కూడా అద్భుతమే.!

-

సీజన్ బట్టే మనకు కొన్ని పండ్లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే మావిడిపండ్లు వస్తాయి. జుర్రుకోనీ తినోయెచ్చు.. ఇంకా రేగిపండ్లు, నేరేడు పండ్లు ఇవన్నీ కూడా ఆయా సీజన్లోనే మనకు దొరుకుతాయి. సీజన్ అయిపోయాక మనం తినాలనుకున్నా అవి ఎక్కడా అందుబాటులో ఉండవు. కానీ ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు అన్నీ కాలలలో కాస్తే ఎలా ఉంటుంది. భలే ఉంటుంది కదా..కానీ ఇది నిజమెప్పుడు అవ్వాలి అనుకుంటున్నారా..నిజమేనండి..ఓ వ్యక్తి ఒకే చెట్టుకి 40 రకాల పండ్లను కాయించాడు. ఈ కథేంటో ఎలా చేశాడో మీరు ఓ లుక్కేయండి.!

పెన్సిల్వేనియాలోని రీడింగ్‌ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి ఈ రకమైన చెట్లను పెంచుతున్నాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యమైందట. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించాడు. ఇది ఒక రకమైన సైన్స్‌ ఎక్పరిమెంట్‌ అని చెప్పుకోవచ్చు.

మామూలు చెట్లలాగానే ఈ చెట్లు కూడా పెరుతుంది. అయితే వసంత (స్ప్రింగ్‌), వేసని (సమ్మర్‌) ఋతువుల్లో మాత్రం ఈ చెట్టు అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవట. అంత అద్భుతంగా ఉంటుంది మరి. పింక్‌ కలర్‌లో చూపరులను ఆకట్టుకుంటుంది. తర్వాత నెలల్లోనే ఈ చెట్టు రేగు, పీచెస్‌, ఆప్రికాట్‌ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట. ఈ ప్రక్రియ మొత్తాన్ని శామ్‌ వాన్‌ అకెన్‌ మాత్రం ఆర్ట్‌ వర్క్‌లా భావిస్తానని చెబుతున్నాడు.

ఆయన ఏం చెబుతున్నాడంటే..

“40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుక్కోటానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. పారిశ్రామికీకరణ, ఏకీకృత సంస్కృతి వల్ల ఆహార ఉత్పత్తిలో వచ్చిన వైవిధ్యాన్ని గుర్తించాను. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే విషయం నేను తెలుసుకున్నాను. రైతులు, పండ్ల తోటలు పెంచే వారినుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించాను” అని అకెన్ చెప్పుకొచ్చాడు.

వింటుంటేనే ఇది నమ్మశక్యంగా లేదు. కానీ చేసి చూపించాడు అకెన్. అమెరికాలోని అర్కన్‌సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో వాన్ అకెన్ చెట్లను చూడవచ్చు. వివిధ రకాల పండ్ల చెట్లను పెంచడం, సాగు చేయడం, శుభ్రపరచడం అంటే సమయం ఎక్కువ కావాలి, అలాగే స్థలం కూడా కావాలి అలాకాకుండా.. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే.. అనే అతని వినూత్న ఆలోచన నుంచే పుట్టుకొచ్చిందే ఈ చెట్టు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version