కొడాలి నాని ఓ నీచుడు, నికృష్టుడు, దృష్టుడు, పనికి రానివాడు : వర్ల రామయ్య

-

కొడాలి నానిపై టిడిపి నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని ఓ నీచుడు, నికృష్టుడు, దృష్టుడు, పనికి రానివాడు, దద్దమ్మ ,యూజ్ లెస్ ఫెలో అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతి తీసుకు వచ్చారు..నీ కళ్యాణ మండపంలో ఏమి జరిగిందో నీవు చెప్పాలి..నీ పోలీసులు చెప్పాలన్నారు. మేము నిజ నిర్దారణ బృందం వెళితే.. గుడివాడ లో వైసీపీ నేతలను కంట్రోల్ చేయలేరా..అని ప్రశ్నించారు.

డిజిపి పనికి మాలినవాడని.. గుడివాడ పోలీసులు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి..క్యాసినో జరగలేదా అని ఆగ్రహించారు. బోండా ఉమ కారుపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని.. మాకు అనుమతి ఇవ్వకుండా.. వైసీపీ నేతలకు అనుమతి ఇస్తారా అని నిప్పులు చెరిగారు. పోలీసులు తమాషా చేస్తున్నారు..కొడాలి నాని వంటి పనికి మాలిన మంత్రి మీ పక్కన ఉంటే ముఖ్యమంత్రి కి సిగ్గు అనిపించలేదా..అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version