మూడు పెళ్ళిళ్ళు, 30 మందితో తిరగడం ఒక చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళలను ఉద్దేశించి స్టెఫినీ అనే పదాన్ని ఉపయోగించటం దుర్మార్గమన్నారు. మూడు పెళ్ళిళ్ళ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయని.. భరణంతో సమస్యలు పరిష్కారం అవుతాయా?? అని నిలదీశారు.
భరణం అనేది భార్యలను వదిలించుకోవటానికే అని పవన్ కళ్యాణ్ చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారని.. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు సంతోషంగా ఉన్నారా?? అని ఆగ్రహించారు. ఎవరి స్థాయిని బట్టి వారు డబ్బులు ఇచ్చి భార్యలను వదిలించుకోవాలని పవన్ కళ్యాణ్ ఎలా పిలుపునిస్తారు?? పవన్ కళ్యాణ్ రియలైజ్ అవుతారేమో అని చూశామన్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, 30 మందితో తిరగటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు.. సమాజంలో కొన్ని విలువలు, నిబంధనలు ఉంటాయి కనుకే ఆగుతున్నారని ఫైర్ అయ్యారు. సినీ హీరో అయిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమాజం పై ప్రభావం చూపిస్తాయన్నారు.