దీపావళి తర్వాత ఈ వ్యాధులు ముదిరే ప్రమాదం ఎక్కువ..!!

-

దీపావళి పండుగ మొదలైంది..మార్కెట్‌లో టపాసులుతో దుకాణాలు నిండిపోయాయి. దీపావళి తర్వాత, దేశంలో కాలుష్యం పెరిగే పెను ప్రమాదం పొంచి ఉంది. మారుతున్న వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం, పటాకులు పేల్చడం వంటి కారణాలతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతుందని నిపుణులు అంటున్నారు..ఈసారి పెరుగుతున్న కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1, 2023 వరకు అన్ని రకాల పటాకుల అమ్మకం, వినియోగం, తయారీని నిషేధించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌సీఆర్‌లో పటాకులు పేల్చడాన్ని నిషేధించింది. దీపావళి తర్వాత అనేక ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉంది. మీరు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే తప్పించుకోలేరు..

ప్రమాదకర గాలి నాణ్యత కారణంగా, COPD వ్యాధులు ప్రజలను ముంచెత్తుతాయి. దీని కారణంగా మీరు పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు ఇన్ఫెక్షన్‌ భారినపడే ప్రమాదం ఉంది.

పటాకుల వల్ల వచ్చే కాలుష్యం ఆస్తమా రోగులను మరింత ప్రమాదంలో పడేస్తుంది. దీనితో పాటు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

పటాకుల పొగ వల్ల మనుషుల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎందుకంటే పటాకుల నుంచి వచ్చే పొగ బ్రాంకైటిస్‌లో సమస్యలను కలిగిస్తుంది.

దీపావళి సమయంలో ప్రజలకు ఆహారంపై నియంత్రణ ఉండదు. ఈ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల అనేక కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. పేలవమైన జీర్ణక్రియ కారణంగా, ఊబకాయం పెరగడం ప్రారంభమవుతుంది.

దీపావళి తర్వాత, ప్రజలు షుగర్, హై బీపీ సమస్యను ఎదుర్కొంటారు. అధిక బీపీ ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడేవారు పటాకులు పెద్ద శబ్దంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

దీపావళి పండుగ మన ఇంట్లోకి సుఖ శాంతులను ఆనందాలను తీసుకువచ్చేలా జరుపుకోవాలి. అనవసరంగా టపాసులతో కాలుష్యానికి కారణమై రోగాలను కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి.! ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా ఇంకా ప్రజలు మార్పు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news