ఆర్జీవీనా.. మజాకా..చంద్రబాబుకు దిమ్మతిరిగే గిఫ్ట్.. చూస్తే నవ్వాగదు..

-

తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు 73 వ పుట్టినరోజును జరుపుకొనున్నారు..ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దమౌతున్నారు..ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో కేక్ కట్ చేయనున్నారు. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. అన్నదానాలతోపాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయనున్నారని సమాచారం..

చంద్రబాబు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అప్పుడే ఆయన జన్మదిన వేడుకల కోలాహలం నెలకొంది. నియోజకవర్గంపై పట్టు కోల్పోలేదని నిరూపించుకునేలా ఈ ఏర్పాట్లను సాగిస్తోన్నారు టీడీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. నియోజకవర్గ కార్యాలయాన్ని అలంకరించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.. ఈ క్రమంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుకు దిమ్మతిరిగే బర్త్‌డే గిఫ్ట్‌ను ఇవ్వడానికి రెడీ అయ్యారు..ఇదివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. సెటైర్లతో చెలరేగిపోయారు.

పవన్ కల్యాణ్‌ వారాహి వాహనాన్నీ వదల్లేదు. తాజాగా మరోసారి ఆయన చంద్రబాబుపై సెటైర్లు సంధించడానికి రెడీ అయినట్టే. చంద్రబాబు మీద ఓ పాటను రూపొందించారు. సీబీఎన్ సిక్కో అనే లిరిక్‌తో ఈ పాట సాగుతుంది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే- లిరిక్స్, వాయిస్, మ్యూజిక్.. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినవే. అందులోని ఓ వినిపించే గొంతు తన వాయిస్‌లా ఉంటుందని, కానీ తనది కాదని చెప్పారు వర్మ.అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందేనని, పంచభూతాల మీద ప్రమాణం చేసి, చెబుతున్నానంటూ సెటైర్లకు పరోక్షంగా తెర తీశారు. ఈ పాటను గురువారం మధ్యాహ్నం 12 గలకు విడుదల చేస్తాననీ చెప్పారు..ఈ విషయాన్నీ స్వయంగా వర్మ నే తన ట్వీట్ లో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version