బంగారు తెలంగాణ అని..తాగుబోతుల తెలంగాణగా మార్చాడని కేసీఆర్ పై వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని.. ప్రజలను తాగుబోతులను చేసి.. సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. పర్మిట్ రూమ్ లంటూ బార్ షాపుల తయారు చేశారని.. మనుషులను తాగించి ఆరోగ్య కరాబ్ చేసుకుంటున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
బీహార్, గుజరాత్ తో మద్యం లేకుండా పని చేస్తున్నాయని.. ఈ ప్రభుత్వం పై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలన్నారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని.. ఒకే బస్తీలో మూడు , నాలుగు బార్ , వైన్ షాపు లు తెరిచారని మండిపడ్డారు.
ప్రభుత్వం విస్కీ , వైన్ అమ్మకాలతోన నడుస్తోంది… స్కూల్ లను మూసేసి.. ఒక్కొక్క ఊళ్లో రెండు బెల్ట్ షాపు లు తెరిపించారన్నారు. కేసీఆర్…తాగుబోతుల తెలంగాణ గా మార్చాడు…మహిళ ల తరుపున నేను పోరాటం చేస్తా.. కెసిఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. వైన్ షాప్ లు క్లోజ్ చేయకపోతే ఓట్లు వేయమని సపతం చేయాలని… రాహుల్ గాంధీ, రేవంత్ తో ఆలోచన చేసి.. మధ్యపాన నిషేధం పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు వి.హనుమంతరావు.