అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కించిన “F 3″ సినిమా ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.మరోవైపు ఈ హీరో తన తొలి సిరీస్ కోసం కూడా షూటింగ్ చేస్తున్నాడు.ఈ సిరీస్ కి మేకర్స్” రానా నాయుడు”అనే టైటిల్ ని లాక్ చేశారు.తాజాగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నట్లు, అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే వెంకటేష్ ఫైనల్ నెరేషన్ ని విని స్క్రిప్ట్ ని లాక్ చేసినట్లు సమాచారం.యాక్షన్- కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని టాక్.ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలోనే వెల్లడి చేయనున్నారు.