కల్యాణ్‌రామ్‌ ‘అమిగోస్’ నుంచి వీడియో సాంగ్‌

-

బింబిసార బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఊపుమీదున్న కల్యాణ్‌రామ్‌ తాజా సినిమా అమిగోస్‌. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘అమిగోస్’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ అనే కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడున్నా స్నేహం వెతికాం, పక పక పక ఇక్కడికి వచ్చి ఒకరికి ఒకరం దొరికాం’ అంటూ ఈ పాట సాగుతోంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ పాటలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేసే క్రమంలో వచ్చే పాట ఇది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కథాకథనాల పరంగా కల్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version