కాశ్మీర్ లో షూటింగ్ కి విజయ్ దేవరకొండ- సమంత !

-

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా రూపొందుతుందని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది.అయితే లైగర్ సినిమా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా, ఇక ఇప్పుడు పట్టాలెక్కుతోంది.ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆమెనే ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది.ఈ నెల21వ తేదీన ఈ సినిమా ను లాంఛ్ చేయునట్లుగా చెబుతున్నారు.ఆరోజు ఉదయాన్నే పూజా కార్యక్రమాలుు మొదలవుతాయని అంటున్నారు.ఈ నెల23వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును స్టార్ట్ చేయనున్నారు.

ఫస్ట్ షెడ్యూల్ ను కాశ్మీర్లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.హీరో, హీరోయిన్ ల మధ్య అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు గా తెలుస్తుంది.ప్రేమ కథల స్పెషలిస్ట్ గా శివ నిర్వాణకి మంచి పేరుంది.ఈ సినిమా కూడా ప్రేమ కథ నేపథ్యంలోనే కొనసాగుతుందట.విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సోల్జర్ గా కనిపించనున్నాడట.సినిమాలో సమంత పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు.” మజిలీ” తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version