Beast: ‘బీస్ట్’ టీమ్‌కు విజయ్ సర్‌ప్రైజ్..ఎమోషనల్ అయిన డైరెక్టర్ నెల్సన్ 

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్- డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘బీస్ట్’ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఇందులో విజయ్ కు జోడీగా టాలీవుడ్ బుట్టొబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఈ పిక్చర్ విడుదలై సక్సెస్ ఫుల్ గా తమిళ నాట నడుస్తోంది. అయితే, విజయ్ అభిమానులు కొందరు సినిమా అనుకున్న స్థాయిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పైన ఫోకస్ చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, విజయ్ మాత్రం సినిమా సక్సెస్ అయిందని పేర్కొన్నారట. ఈ క్రమంలోనే తాజాగా ‘బీస్ట్ ’ మూవీ యూనిట్ సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

‘బీస్ట్’ మూవీ యూనిట్ సభ్యులను తన ఇంటికి పిలిచి మరీ వారికి పార్టీ ఇచ్చారు విజయ్. వీరందరికీ తన ఇంటిలో భోజనాలు ఏర్పాటు చేసి, వారితో కలిసి విజయ్ భోజనం చేశారు.ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు డైరెక్టర్ నెల్సన్. విజయ్ స్టార్ డమ్ వలనే సినిమా రన్ అవుతున్నదని, తనకు ఇంతటి అవకాశం ఇచ్చిన విజయ్ కు ధన్యవాదాలు చెప్తున్నానని ట్విట్టర్ వేదికగా హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేశాడు నెల్సన్.

ఫొటోలో హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో పాటు మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, డైరెక్టర్ నెల్సన్ ఉన్నారు. తెలుగులోనూ ఈ చిత్రం అదే టైటిల్ తో విడుదలైంది. అయితే, తమిళనాట ఉన్నంత ఆదరణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పిక్చర్ కు కనిపించడం లేదు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘బీస్ట్’ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన నెక్స్ట్ మూవీని తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయనున్నారు. ఆ పిక్చర్స్ ను కూడా సన్ పిక్చర్స్ వారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో భారీ తారాగణమే ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి..ఈ చిత్ర ప్రారంభం ఎప్పుడో..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version