చంద్రబాబు ముసలి నక్క, లోకేష్ గుంట నక్క అని వివాదస్పదవ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. టీడీపీ పార్టీ అధ్యక్షుడిని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఈ మధ్య ప్రారంభమైందని.. లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటూ చురకలు అంటించారు. ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన ప్రారంభించారని.. ముసలి నాయుడు, పప్పు నాయుడు ..ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలని హెచ్చరించారు.
ప్రభుత్వానికి.. విద్యార్థులు ఫెయిల్ అవటానికి సంబంధం ఉండదన్నారు. కుసంస్కారం ఉన్న వాళ్ళను తెచ్చి తిట్టించటం కాదని.. మీరు ఒకటి చెబితే… మేం పది చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు చేయవచ్చని..నిన్నటి జూమ్ … ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. పప్పు నాయుడు సవాలును స్వీకరిస్తున్నాం.. చంద్రబాబు అయినా రావచ్చు…మా నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమేనని ఛాలెంజ్ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా… చర్చకు మేం సిద్ధమని..నిన్న లోకేష్ పారిపోయాడు.. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయటం లేదు?? అని నిలదీశారు.
పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండం గా తీసుకోవాలన్నారు.