ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందని చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించాడు : వైసీపీ ఎంపీ

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆత్మ తనపై పగబట్టిందనే భయంతో బాబు అనేకసార్లు క్షుద్ర పూజలు చేయించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారని… మాలోకం ఓటమికి, తన రాజకీయ పతనానికి ఎన్టీఆర్ శాపమే కారణమని తాంత్రిక పూజలు జరిపించాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

పదవి కోసం ప్రాణాలు తీయడానికైనా వెనకాడబోడని.. చీకటి కుట్రలు చేస్తాడని ఆరోపించారు. సిఎంగా 14 ఏళ్లు వెలగబెట్టిన బాబు ఏనాడూ జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని… యాజమాన్యాలను మ్యానేజ్ చేస్తే చాలనే ఫిలాసఫీని నమ్ముకున్నాడని చురకలు అంటించారు. సీఎం జగన్ 25 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారని… వారి కుటుంబాల్లో వెలుగులు నింపే భరోసా ఇచ్చారన్నారు.

50 ఏళ్ల రాజకీయ అనుభవం, మహారాజునంటాడని… కానీ విజయనగరం జిల్లాకు ఒక్క యూనివర్సిటీ తేలేకపోయాడని…50 ఏళ్లు వయసు లేని సీఎం జగన్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేశారని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధిని అడ్డుకోవడం, ట్రస్టు భూముల్ని అమ్మేయడం, సమస్యను జఠిలం చేయడంలోనే అశోక్ గజపతుల వారు అర్థ శతాబ్దం బిజీగా గడిపాడని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version