పోలీస్ ఉద్యోగాల భర్తీపై విజయశాంతి వివాదాస్పద ట్వీట్

-

 

పోలీస్ ఉద్యోగాల భర్తీపై విజయశాంతి వివాదాస్పద ట్వీట్ చేశారు. నిరుద్యోగుల బతుకులతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతోంది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నరని పేర్కొన్నారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 2 నెలలు దాటగా, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగి 40 రోజులవుతోంది. ఇప్పటివరకూ రిజల్ట్స్ ప్రకటించలేదని ఫైర్ అయ్యారు.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకే ఇన్ని రోజులు పడితే, ఈవెంట్ల నిర్వహణ, ఆ తర్వాత మెయిన్స్‌ ఎగ్జామ్, ఫలితాల ప్రకటనకు ఇంకెన్ని నెలలు పడుతుందో… ఈ ఉద్యోగ ప్రక్రియను కేసీఆర్ సర్కార్ సాధారణ ఎన్నికల వరకు సాగదీసేలా కనిపిస్తుంది. సుమారు 2.25 లక్షల మంది ఎస్‌ఐ ఎగ్జామ్ రాయగా, 6.03 లక్షల మంది కానిస్టేబుల్ పరీక్ష రాశారు. ఈ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని లక్షలాది మంది హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి నగరాల్లో కోచింగ్ తీసుకుంటున్నరన్నారు.

 

రిక్రూట్‌మెంట్ ఆలస్యం అవుతున్నకొద్దీ రూమ్ రెంట్లు, కోచింగ్ ఫీజు, గ్రౌండ్‌ ఫీజు, ఫుడ్ తదితర ఖర్చులు నిరుద్యోగులకు భారంగా మారుతున్నయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న కసితో చాలామంది అప్పటికే తాము చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ ఈ ఉద్యోగాలకు కోసం ప్రిపేర్ అవుతున్నరు. ఇలాంటి వాళ్లకు రిక్రూట్‌మెంట్ ఆలస్యమవుతున్న కొద్దీ కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. ఏం కేసీఆర్… ఇంకా ఎన్ని రోజులు నిరుద్యోగులను మోసం చేస్తావ్? ఇప్పటికైనా నియామకాలను భర్తీ చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నం. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news