నిన్ను కాలగర్భం లో కలపడం ఖాయం – కెసిఆర్ కు రాములమ్మ వార్నింగ్

-

తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయింది విజయ శాంతి. ఉస్మానియాలో వ‌సతుల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కే ప‌రిస్థితిని కేసీఆర్ స‌ర్కార్ తీసుకొచ్చిందని.. అన్నంలో పురుగులొస్తున్నాయని, పెరుగు, కూరలు సరిగ్గా ఉంటలేవని, బాత్ రూమ్‌లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ ఆడబిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఉద్య‌మంతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘనత ఉస్మానియా సోంతం. కేసీఆర్…. విద్యార్థుల్ని విస్మరిస్తే వారు నిన్ను కూడా కాల‌గర్భంలో క‌లిపేయడం ఖాయం. ఎన్నోసార్లు రుజువైన సత్యమిది… గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చారు.

ఎక్క‌డైనా ఉంటుందా? దొర‌గారు ఫామ్ హౌస్‌లో ప‌డుకొని పాల‌న చేస్తే.. మ‌న ఆడ‌బిడ్డ‌లు ప‌డుతున్న క‌ష్టం ఏం తెలుస్తుంది? ఆడ‌బిడ్డ‌ల కష్టాలు ప‌ట్టని ఈ సీఎం ఉంటే ఎంత? లేకుంటే ఎంత‌? ఇప్ప‌టికైనా హాస్ట‌ల్స్‌లో సౌల‌తులు క‌ల్పించాలని డిమాండ్ చేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నరు. క‌నీసం తాగునీరు కూడా సరిగ్గా స‌ప్లై చేయ‌డం లేదని… కిటికీలు సరిగ్గా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా… ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇంత‌కంటే దారుణ‌మని మండిపడ్డారు…

Read more RELATED
Recommended to you

Latest news