అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి మరో ట్వీట్ కలకలం

-

అమరావతి: అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి మాన్సాస్‌లో అసలు ఆడిటింగే జరగలేదని ఆయన తెలిపారు. ఆడిటింగ్‌కి డబ్బులిచ్చేశామని – అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే ఏం లాభమన్నారు. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతో మావా – గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యంలా చేశావని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు చంద్రబాబు తీరు అని విమర్శించారు. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు.. చంద్రబాబకు ఎందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏ2 అయిన విజయసాయిరెడ్డి.. తమ నేతలను విమర్శించడమేంటని మండిపడుతున్నారు. దొంగే దొంగ అన్నట్టుగా విజయసాయి వ్యవహారం ఉందని సెటైర్లు వేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో విజయసాయిరెడ్డి విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version