మొహం ఎక్కడ పెట్టుకుంటావ్ బండి సంజయ్- బోయినపల్లి వినోద్ కుమార్

-

తెలంగాణలో వరిధాన్యంపై మొదలైన పోరు అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య నిప్పు రాజేశాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు వాటికి కౌంటర్లతో రోజూ నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరిసాగుపై కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, రిమోట్ సెన్సింగ్ సెంటర్ జాతీయ స్థాయిలో ఖరీఫ్ పంట ముఖ్యంగా వరిసాగు డాటాను వెలుగులోకి తెచ్చారని.. దాంట్లో 59 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని నివేదిక చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 62 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని చెబితే బీజేపీ నాయకుడు బండి సంజయ్ అపహస్యం చేశారన్నారు. వరి ఎక్కడ సాగవుతుంది.. కేసీఆర్ చూపిస్తావా అని వ్యంగంగా బండి సంజయ్ మాట్లాడారని… ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నివేదికపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీరు చూడరు..ఏది పడితే అది మాట్లాడే నాయకుడిగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కువగా వరిని సాగులోకి తీసుకువచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం తెలిపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news