కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే పారిపోయావని ప్రధాని మోడీపై వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. మోడీ ఉపన్యాసం లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారని… కేసీఆర్ మాట్లాడిన విషయాల పై మోడీ స్పందించ లేదు. స్పందించలేడని చురకలు అంటించారు. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం లేదని… శ్రీలంక ప్రభుత్వం పై మోడీ ఒత్తిడి తెచ్చారా లేదా చెప్పలేదన్నారు.
మోడీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేసారని.. రైల్వే, జాతీయ రహదారులు, ఆర్ ఆర్ ఆర్ కు నిధులు ఇచ్చానని ప్రధాని చెప్పారు. మోడీ కాకుండా ఇంకా ఎవరున్నా నిధులు ఇచ్చే వారని వెల్లడించారు.
సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది… విభజన హామీలు అమలు చేయలేదని.. తెలంగాణకు కొత్త జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇచ్చినవి తెలంగాణ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు ఒక్కటీ కూడా సమాధానం ఇవ్వలేదు..ఉత్తర ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ కు జాతీయా హోదా ఇచ్చారు. 40 వేల కోట్లు ఇచ్చారని ఆగ్రహించారు.