అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ

-

తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (76) అర్ధశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షమీ అద్భుతమే చేశాడు.

చివరి ఓవర్లో 11 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో.. ఎవరూ ఊహించని విధంగా మహమ్మద్ షమీకి బంతిని అందించాడు రోహిత్. అప్పటి వరకు మ్యాచ్‌లో లేని షమీ.. ఆ ఓవర్లో అద్భుతమే చేశాడు. తొలి రెండు బంతులకు నాలుగు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి కమిన్స్ సిక్సర్ బాదేందుకు చూశాడు. అయితే లాంగాన్‌లో ఉన్న కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ అందుకున్న క్యాచ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. 176 పరుగుల వద్ద టీమ్ డేవిడ్ ని రన్ అవుట్ చేసి భారత జట్టు విజయానికి కీలకంగా మారాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version