విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ రిలీజ్

-

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా దర్శకుడు రవితేజ ముళ్లపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ 1.0 రిలీజ్ కి తీసుకొచ్చారు. అది ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నువ్వేం ఫికర్ చేయకు నాన్న.. ఎట్టయినా నేను సివిల్ ఇంజనీర్ అయిపోతా అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. ఈ ట్రైలర్ ప్రారంభంలో హీరోయిన్స్ తో నరేష్ విశ్వక్ సేన్ కామెడీ అదిరిందనే చెప్పాలి. యంగ్ మెకానిక్ డ్యాన్స్, ఫైట్స్ లో విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్ బాగుంది అనే చెప్పాలి. విలన్ రోల్ లో సునిల్ కనిపించారు. విశ్వక్ సేన్-సునీల్ మధ్య సీన్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. రజనీ తాళ్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.  నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version