ఏప్రిల్ 14న ఓటిటి లోకి విశ్వక్ సేన్ “దాస్ కా ధమ్కీ”… !

-

టాలీవుడ్ లో స్వశక్తితో పైకి వచ్చిన వారిలో విశ్వక్ సేన్ పేరు కూడా ఉంటుంది. ఇతనికి ఒక టాలెంట్ అని కాదు.. హీరో, రైటర్, డైరెక్టర్ మరియు నిర్మాత.. తాజాగా రిలీజ్ అయిన దాస్ కా ధమ్కీ మూవీకి విశ్వక్ సేన్ దర్శకుడు మరియు నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుని విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఇక పాటలు అయితే మరో రేంజ్ లో హిట్ అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో దర్శనమ్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.

మరో రెండు రోజుల్లో ఈ మాస్ కామెడీ ఎంటర్టైనర్ ఆహాలో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్ లో మంచి వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఓటిటి లోనూ ఎక్కువంనంది వీక్షించి హిట్ చేస్తారని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version