తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి : వివేక్‌ వెంకటస్వామి

-

ఇవాళ ఉదయం వరంగల్, జనగామా జిల్లాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు వివేక్ వెంటస్వామి పర్యటించారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఆయన. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, కొనుగోలు కేంద్రాలలో ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు వివేక్ వెంకటస్వామి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ జల్సా చేస్తుందని మండిపడ్డారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద 5 నుంచి 7 కిలో వరకు తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నరని వివేక్ వెంటస్వామి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదు.. ఎరువులు ఇవ్వలేదు..పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యథాపరిచారు. రాష్ట్రంలో ఫసల్ భీమా అమలు చేయకపోవడం వల్లే రైతులకు పరిహారం అందక నష్ట పోతున్నారని పేర్కొన్నారు వివేక్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news