విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కేసు 3 వారాలకు వాయిదా …!

-

దేశంలో బీజేపీ వరుసగా రెండవ సారి గెలిచి పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ బీజేపీ అధినాయకత్వం తీసుకున్నకొన్ని నిర్ణయాల వలన దేశ ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది. కాగా మోదీ సారధ్యంలో కొన్ని నిర్ణయాలు తెలుగు ప్రజలను సైతం ఆగ్రహానికి గురి చేశాయి. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన ఆస్తులను మరియు సంస్థలను ప్రయివేట్ పరం చేసే దిశగా అడుగులు వేశారు. ముఖ్యంగా ఆంధ్రులకు ఎంతో సెంటిమెంట్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మే యోచనలో కేంద్రం ఉండడంతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హై కోర్ట్ లో విచారణ జరిగింది. అయితే ఈ విషయంపై కౌంటర్ వేయాలని కోర్ట్ ఆదేశించగా, ఇందుకు కేంద్రం సమయం కోరింది.

అందుకోసం హై కోర్ట్ ఈ కేసును విచారించడానికి మరో మూడు వారాలు సమయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version