దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కేరళ పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాం మరియు వెస్ట్ బెంగాల్. వాళ్లు ఓటర్ ఐడి కోసం అప్లై చేసుకోవచ్చు. ఓటర్ ఐడి కార్డులు కార్డు హోల్డర్ పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఫోటో, రాష్ట్రం పేరు, అడ్రస్ మొదలైన డీటెయిల్స్ ఉంటాయి.
భారతీయులు ఎవరైనా 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఓటర్ కార్డ్ కోసం అప్లై చేయొచ్చు. ఆన్లైన్లోనూ ఆఫ్ లైన్ లోను ఎలా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓటర్ ఐడి ని అప్లై చేయడం కోసం ఐడెంటిటీ అడ్రస్ మరియు ఫోటో గ్రాఫ్ అవసరం.
ఓటర్ ఐడి కార్డు కోసం ఆన్లైన్ లో ఇలా అప్లై చేయండి:
ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఫర్ న్యూ వోటర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి.
పేరు, డేట్ అఫ్ బర్త్, చిరునామా మరియు అవసరమైన డాక్యుమెంట్స్ పెట్టండి.
అప్పుడు సబ్మిట్ చేయండి.
ఇప్పుడు ఓటర్ ఐడి లో లింక్ చేయబడిన మెయిల్ ఐడి కి ఇమెయిల్ వస్తుంది.
అక్కడ ఓటర్ ఐడి కి సంబంధించి వివరాలు ట్రాక్ చేయవచ్చు. నెలరోజుల్లోగా మీకు ఓటర్ ఐడి కార్డు వచ్చేస్తుంది.