అల్లూరి జిల్లాలోని పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా తమ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గత నెలలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. అయితే ఇప్పుడు అల్లూరి ఆదివాసి యువజన సంఘం పేరిట వెలసిన పోస్టర్లలో గిరిజనులకు ఉపయోగపడని వారోత్సవాలు వద్దు అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
అమాయక గిరిజనులను ఇంఫార్మర్ నెపంతో చంపుతున్నారని.. సెల్ టవర్లు పేల్చి ప్రభుత్వ పథకాలను, మా గిరిజన యువత విజ్ఞాన అవకాశాలను దూరం చేస్తున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.రోడ్లు రాకుండా చేసి అభివృద్ధి కి దూరంగా బతకమన్నారని తెలిపారు. మావోయిస్టులారా మీరు ఎక్కడవుంటే అక్కడ వినాశనం, విధ్వంసం అంటూ ఈ పోస్టర్లు వెలిశాయి.